అన్ని వర్గాల సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం : సంజయ్ కుమార్

జగిత్యాల టౌన్, వెలుగు : అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల అర్బన్ మండలం మోతే గ్రామ శివారులో రూ.10 లక్షలతో నిర్మించిన రిటైల్ చేపల మార్కెట్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. అనంతరం ధరూర్ క్యాంప్ లో జడ్పీ హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో సీఎం బ్రేక్‌‌‌‌‌‌‌‌ఫాస్ట్​కార్యక్రమాన్ని జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ వసంత, కలెక్టర్ యాస్మిన్ భాషాతో కలిసి ప్రారంభించారు.

బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించారు. రామాలయం కల్యాణ మండపం వద్ద నిర్మించనున్న వంట గదికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీనివాస్, ఎంపీపీ లక్ష్మి, డీఈవో జగన్మోహన్ పాల్గొన్నారు.