జగిత్యాల అభివృద్ధికి కృషి..ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల ప్రజల సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో రూ. 80 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులు కబ్జా కాకుండా చూసే బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులదన్నారు. మోతే, చింతకుంట చెరువుల ప్రక్షాళనకు రూ 5.60 లక్షలతో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీపీ మంజూరయిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జ్యోతి, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్లు హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గంగాసాగర్, కృష్ణ హరి, ఏఈ అనిల్ పాల్గొన్నారు.