
జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల నూకపల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్లకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ నూకపల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్లలో కొనసాగుతున్న డ్రైనేజీ, ట్రాన్స్ ఫార్మర్,సెప్టిక్ ట్యాంక్, వాటర్.. పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.32కోట్లు మంజూరుచేసిందన్నారు. పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాణిపేట స్కూల్‌లో గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన వెంట లీడర్లు శ్రీనివాస్, లక్ష్మణ్, నాగయ్య, అనిల్, రాంకుమార్ ఉన్నారు.