బీఆర్ఎస్‌‌‌‌ది ఎప్పుడూ పేదల పక్షమే : సంజయ్ కుమార్

జగిత్యాల టౌన్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షానే ఉంటుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల రూరల్ మండలం సోమన్‌‌‌‌పల్లి, సంఘంపల్లి, హబ్సిపూర్, తక్కలపల్లి గ్రామాల్లో కార్నర్ మీటింగ్‌‌‌‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

మరోసారి బీఆర్ఎస్‌‌‌‌ను గెలిపిస్తే పెన్షన్ రాని మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం, నిరుపేదలకు రూ.5లక్షల బీమా అందిస్తామన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కండ్ల ముందే కనబడుతోందని, చేసిందే చెబుతున్నామని, చెప్పిందే చేసి చూపిస్తున్నామన్నారు. పట్టణంలోని 8,9,35,44,45 వార్డుల్లోనూ కార్నర్ మీటింగ్‌‌‌‌లు నిర్వహించారు.