జగిత్యాల రూరల్, వెలుగు : డబుల్ ఇండ్లు జగిత్యాల పట్టణానికి చారిత్రాత్మకం అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. లబ్ధిదారులకు నూక పెల్లి లో నిర్మించిన 3,722 డబుల్ ఇండ్ల ప్రోసిడింగ్ కాపీలను అందజేశామని, రాని వారికి మళ్ళీ అవకాశం కల్పిస్తామని అన్నారు. జగిత్యాల పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,మెగా రైస్ మిల్, కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ మంజూరుకు కేటీఆర్ హామీ ఇవ్వడం హర్షణీయమని అన్నారు.
అలాగే లక్ష్మీపూర్ గ్రామంలో 20 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రొసీడింగ్స్ ను, బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. 38లక్షలతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ ఎల్ రమణ, జెడ్పీ చైర్పర్సన్ వసంత, లైబ్రరీ చైర్మెన్ చంద్ర శేకర్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రప్రసాద్, సర్పంచ్ జాన్, ఎంపిటిసి సునీత,మహిపాల్ రెడ్డి,నక్కల రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.