జగిత్యాల టౌన్, వెలుగు: తెలంగాణ ఏర్పాటు తర్వాత జగిత్యాల వేగంగా అభివృద్ధి చెందిందని, మరోసారి అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం 19వ వార్డు జంబీ గద్దె ప్రాంతానికి చెందిన గౌడ సంఘం, మైనార్టీ, ఇతర వర్గాల యువకులు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్హయాంలో జగిత్యాల జిల్లా కేంద్రంగా మారిందన్నారు.
కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ చంద్రశేఖర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, సతీశ్ , కౌన్సిలర్లు నారాయణరెడ్డి, నవీన్ పాల్గొన్నారు.