వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే : సంజయ్ కుమార్

జగిత్యాల టౌన్, రాయికల్, వెలుగు: తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మరింత అభివృద్ధి చేసేది తామేనని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బీర్పూర్ మండలం చిత్రవేణిగూడెంలో దండారి సంబరాల్లో పాల్గొని ఆదివాసీ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక బీర్పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మండలం చేశామన్నారు.

రూ.1.30 కోట్లతో నరసింహులపల్లి, కొలువాయి మధ్య పైప్‌‌‌‌‌‌‌‌లైన్​వేశామన్నారు. అంతకుముందు ఉదయం ఎమ్మెల్సీ ఎల్‌‌‌‌‌‌‌‌.రమణతో కలిసి ధరూర్‌‌‌‌‌‌‌‌ క్యాంపులో వాకర్స్‌‌‌‌‌‌‌‌ను  కలిశారు. జగిత్యాల పట్టణంలో చేసిన అభివృద్ది, అందించిన కార్యక్రమాలను వారికి వివరించి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. రాయికల్ మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన 40మంది మహిళలు ఎమ్మెల్సీ ఎల్.రమణ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.