ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలి : సంజయ్ కుమార్

జగిత్యాల, వెలుగు: అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ బలమని, పార్టీ గెలుపు కోసం ప్రతిఒక్కరూ సైనికుల్లా పని చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలోని పార్టీ జిల్లా ఆఫీసులో ఎమ్మెల్సీ ఎల్.రమణతో కలిసి పార్టీ టౌన్​ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని జగిత్యాలలో పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం బీఎల్ఎన్ గార్డెన్స్ లో నియోజకవర్గ పెరిక కుల సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. కార్యక్రమంలో పెరిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాల ముకుందం, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సతీశ్‌‌‌‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.