3 లక్షల మంది నా కుటుంబ సభ్యులే : సంజయ్ కుమార్

జగిత్యాల, వెలుగు : జగిత్యాల నియోజకవర్గంలోని 3 లక్షల మంది తన కుటుంబ సభ్యులేనని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల టౌన్‌‌లోని 22, 37 వార్డుల్లో ఎమ్మెల్యే ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టౌన్‌‌లో డివిజన్లలో అనేక అభివృద్ధి పనులు చేశానన్నారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సతీశ్, లీడర్లు శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు