
జగిత్యాల రూరల్, వెలుగు: మొక్కజొన్న రైతులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కలిసి వినతిపత్రం అందజేశారు.
జగిత్యాల నియోజకవర్గ పరిధిలో దాదాపు 6వేల ఎకరాల్లో మొక్కజొన్న పండించారని, రైతులకు ఇబ్బందులకు రాకుండా పంటను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని కోరారు.