జగిత్యాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌‌

జగిత్యాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌‌

జగిత్యాల రూరల్, వెలుగు: ప్రజల సహకారంతో జగిత్యాల పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని లింగంపేటలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌‌లో భాగంగా రూ.13 లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖానను ప్రారంభించారు. అనంతరం పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక పల్లె దవాఖానాలు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరయ్యయన్నారు.

గత ప్రభుత్వ హయాంలో నిధుల మంజూరులో ఆలస్యం కావడం వల్లే డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం లేటయిందన్నారు. వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల తనకు నష్టమేమి లేదని, తన జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. అనంతరం పంచాయతీ రాజ్, వెటర్నరీ, హెల్త్ ఆఫీసర్స్ తో పంచాయతీరాజ్ ఈఈ ఆఫీసులో రివ్యూ నిర్వహించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో ప్రమోద్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరేశ్, కమిషనర్ స్పందన,ఈఈ లక్ష్మణరావు, జ్యోతి, గిరి నాగభూషణం, అధికారులు, పాల్గొన్నారు.