నారాయణ్ ఖేడ్ మండలలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నారాయణ్ ఖేడ్ మండలలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నారాయణ్ ఖేడ్, వెలుగు: మండల పరిధిలోని సంజీరావుపేట, నిజాంపేట్ మండల పరిధిలోని నాగ్ ధర్, బాచెపల్లి గ్రామాల్లో  ఎమ్మెల్యే సంజీవరెడ్డి శనివారం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. సన్నాలకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామని,  సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందజేస్తున్నామని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనంతరం కొండాపూర్, మంగళపేట్ లోని ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భవానీ టెంపుల్ వద్ద నుంచి శివాజీ చౌక్ వరకు వీహెచ్​పీ, బజరంగ్​దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రమేశ్ చౌహన్, శంకర్, వివేకానంద, మాజీ ఎంపీ బీబీ పాటిల్, జీఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మచ్చేందర్ పాల్గొన్నారు.