ఖేడ్ పట్టణంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ఖేడ్ పట్టణంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

నారాయణ్ ఖేడ్, వెలుగు: ఖేడ్ పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్ లో గురువారం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయని, పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు.

 ముందస్తుగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డీసీసీప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నగేశ్ కుమార్ షెట్కార్, రాకేశ్ కుమార్ షెట్కార్, ఆనంద్ స్వరూప్ షెట్కార్, ధారం శంకర్, తాహెర్ అలీ, రమేశ్ చౌహన్, పండరిరెడ్డి పాల్గొన్నారు.