
నారాయణ్ ఖేడ్, వెలుగు: పేదలకు వరం సీఎంఆర్ఎఫ్ అని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శనివారం వివిధ మండలాల లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం, విద్యను అందించడానికి ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముదిరాజ్ శంకర్, రాములు పాల్గొన్నారు.
గేదె పాలకు బోనస్ ఇచ్చేలా కృషి
గేదె పాలకు రెండు రూపాయలు అదనంగా పెంచేందుకు కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు. నారాయణఖేడ్ లోని మిల్క్ చిల్లింగ్ సెంటర్లో పాడి రైతులతో సమావేశంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సంస్థను కాపాడుకోవాలని రైతులకు సూచించారు. పశువులకు ఇన్సూరెన్స్ పాలసీలు చేయిస్తామన్నారు.