కొత్త మెనూతో స్టూడెంట్స్​కు పండగే : ఎమ్మెల్యే సంజీవరెడ్డి

కొత్త మెనూతో స్టూడెంట్స్​కు పండగే :  ఎమ్మెల్యే సంజీవరెడ్డి
  • ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణ్ ఖేడ్, వెలుగు: ప్రభుత్వం గురుకులాల్లో ప్రవేశపెట్టిన కొత్త మెనూతో స్టూడెంట్స్​కు పండగే అని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శనివారం జూకల్ శివారులోని ఆశ్రమ స్కూల్​లో కొత్త మెనూ ఆవిష్కరించి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారి కూడా డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే స్టూడెంట్స్ కి క్వాలిటీ భోజనంతో పాటు డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచిందన్నారు. 

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల శంకుస్థాపన చేశామన్నారు. ఇందులో భాగంగా ఖేడ్ నియోజకవర్గంలోని వాసర్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్​, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ శంకర్, స్కూల్ స్టాప్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.

సర్కార్​ను బద్నాం చేస్తే ఊరుకోం..

కంగ్టి: అవినీతి, అక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్ బీఆర్ఎస్ పార్టీ అని ఎమ్మెల్యే సంజీవ రెడ్డి అన్నారు. స్థానిక ఎంపీపీ ఆఫీసులో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. గత సర్కారు ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి కాంగ్రెస్ పార్టీని బద్నామ్ చేసేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలు క్లీన్​స్వీప్​చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీటీ జుబేర్, ఎంపీడీవో సత్తయ్య, పార్టీ లీడర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.