నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రభుత్వ పథకాల అమలులో ప్రాధాన్యం ఇవ్వాలి : ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రభుత్వ పథకాల అమలులో ప్రాధాన్యం ఇవ్వాలి : ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణ్ ఖేడ్,వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గం వెనుకబడిందని ప్రభుత్వ పథకాల అమలులో ఖేడ్ కు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సీఎం రేవంత్​రెడ్డిని కోరారు. ఆదివారం ఆయన నివాసంలో సీఎంని మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖేడ్ నియోజకవర్గానికి మొదటి విడతలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఐటీఐ కాలేజ్, స్కిల్ డెవలప్​మెంట్​సెంటర్, ఇండోర్, ఔట్​డోర్ స్టేడియాలను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.