నారాయణ్ ఖేడ్, వెలుగు: ప్రభుత్వ పథకాలన్నీ పారదర్శకంగా అమలు చేస్తామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కల్యాణణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందన్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా అధికారులు పని చేయాలన్నారు.
అనంతరం నియోజకవర్గంలోని గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం హాస్పిటల్ కు అంబులెన్స్ సౌకర్యాన్ని ప్రారంభించారు.
పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేటలో 31 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. మండల కేంద్రంలో 500 మంది పేదలకు ఇళ్ల స్థలాలను అందించేందుకు చర్యలు చేపడతున్నామని, స్థలాన్ని వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గ్రేసి బాయి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మధు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.