
నారాయణ్ ఖేడ్, వెలుగు: ఖేడ్ ఏరియా హాస్పిటల్ లో రేడియాలజీ టీ హబ్ సెంటర్ ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేడియాలజీ టీ హబ్ ద్వారా వివిధ రకాల టెస్టులు చేసుకోవచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా, వైద్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సాయంతో నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్‌ను మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
పేదలు ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలసి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ శంకర్ గుప్తా, మున్సిపల్ కౌన్సిలర్లు, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.