
నారాయణ్ ఖేడ్, వెలుగు: నారాయణఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధికి టీఎస్ యూఎస్డీ నిధుల కింద రూ. 20 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్ లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో వేసిన ఖేడ్ బైపాస్ రోడ్డు పదేండ్లయినా మరమ్మతుకు నోచుకోలేదన్నారు. బైపాస్ రహదారి సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 5 కోట్లు, పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి కోర్టు వరకు సీసీ రోడ్డుకు రూ. 2 కోట్లు
మున్సిపాలిటీలోని అన్ని వార్డుల సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. కోటి, కొత్త కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 1.2 కోట్లు, ఎన్ఆర్ఈజీఎస్ నిధులకింద శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ, జీపీ, స్కూల్రిపేర్కు రూ. 6.50 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నెల 27న ప్రియాంక గాంధీ చేతులు మీదుగా గృహ లక్ష్మి, గృహజ్యోతి పథకాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. రమేశ్ చౌహన్, శంకర్, మాజీద్, సద్దాం పాల్గొన్నారు.