ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు

ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు

నారాయణ్ ఖేడ్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలాంటివని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. గురువారం నారాయణఖేడ్, నిజాంపేట్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. 

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని కానీ వారిలా తాము వ్యవహరించడం లేదన్నారు. వివాహం జరిగిన 6 నెలల లోపు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్, మాజిద్, హన్మాండ్లు, రమేశ్ చౌహాన్, వినోద్ పాటిల్, పండరి రెడ్డి పాల్గొన్నారు.