- ఎమ్మెల్యే సత్యనారాయణ
బెజ్జంకి, వెలుగు: రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఐకేపీ, తోటపల్లి గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు. పెరికబండలో ఇందిరా మహిళా శక్తి పీఎం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ స్కీం ద్వారా సరోజన ఎస్ హెచ్ జీ గ్రూపు సభ్యురాలు చిలువేరి లక్ష్మి ఏర్పాటు చేసిన మినీ రైస్ మిల్లును ప్రారంభించారు. అమ్మ ఆదర్శ కమిటీ నిధులతో ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన వివిధ సౌకర్యాలను ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. దొడ్డుబియ్యం రీసైకిల్ అవుతుందని అందుకే ప్రభుత్వం సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తోందన్నారు. కార్యక్రమంలో ఎక్స్ చైర్మన్ శరత్ రావు, ఏఎంసీ చైర్మన్ కృష్ణ, తహసీల్దార్శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్, పార్టీ అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఏపీఎం నర్సయ్య, ఎంఈ వో మహతీ లక్ష్మి, డైరెక్టర్ మల్లేశం, రాజు, బాలనర్సు, శ్రీనివాస్ గౌడ్, రవి పాల్గొన్నారు.