
కొత్తగూడ, వెలుగు : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆడబిడ్డల పెండ్లికి రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని ములుగు ఎమ్మెల్యే సీతక్క హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డబ్బు సంచులతో వస్తున్న బీఆర్‌ఎస్ లీడర్ల మాయమాటలు నమ్మొద్దని చెప్పారు. ఇన్నాళ్లూ ప్రజలను పట్టించుకోని లీడర్లు ఎన్నికలు రాగానే గ్రామాల్లోకి వస్తున్నారన్నారు. అనంతరం పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరడంతో కండువాలు కప్పి ఆహ్వానించారు. అంతకుముందు గుంజేడు ముసలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఎంపీపీ విజయ రూప్‌సింగ్, మండల అధ్యక్షుడు సారయ్య, వెంకటేశ్వర్లు, నారాయణరెడ్డి పాల్గొన్నారు.