
కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. తెలంగాణ ఇచ్చింది, దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ భూములు పంచితే బీఆర్ఎస్, బీజేపీ అమ్ముకుంటున్నాయని ఆరోపించారు. హాథ్ సే హాథ్ యాత్రలో భాగంగా ములుగు జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సమస్యలు తీరుతాయని చెప్పారు. కేసేఆర్ పాలనలో మంచి నీళ్లు దొరకడం లేదు కానీ... మందు మాత్రం గల్లీ గల్లీలో ఏరులై పారుతోందంటూ కామెంట్ చేశారు. ములుగు జిల్లాకు సమ్మక్క,సారలమ్మ జిల్లా అని పేరు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. రేవంత్ యాత్రను విజయవంతం చేయాలని సీతక్క కోరారు.