ప్రొటోకాల్ పాటిస్తే ఆరోపణలు చేయడం సరికాదు

ప్రొటోకాల్ పాటిస్తే ఆరోపణలు చేయడం సరికాదు

రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు చెప్పినట్లే అధికారులు వినాలన్నట్లుగా పరిస్థితి తయారైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఆఫీసర్లు ప్రొటోకాల్ పాటిస్తే వారిపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. కలెక్టర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు  వ్యవహరిస్తున్నారన్న టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీశ్ వ్యాఖ్యలపై సీతక్క ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ఎమ్మెల్యేలకు అప్పజెప్పిన విషయాన్ని గుర్తు చేసిన ఆమె.. సీఎం నిర్ణయం మేరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రపోజల్స్ పంపితే టీఆర్ఎస్ వాళ్లు రాజీనామా చేస్తామనడం విడ్డూరంగా ఉందని వాపోయారు. భూపాలపల్లి, నర్సంపేట ఎమ్మెల్యేలకు ఉన్నట్లుగానే తమకు ప్రొటోకాల్ ఉండాలని, ప్రతిపక్షం అయినంత మాత్రాన ప్రజల చేత ఎన్నుకోబడలేదా అని ప్రశ్నించారు. 

కలెక్టర్ ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉంటున్నాడన్న వ్యాఖ్యలను సీతక్క తప్పుబట్టారు. మేం కలెక్టర్ దగ్గరకు వెళ్లొద్దా, మాట్లాడొద్దా అని ప్రశ్నించారు. అధికారులు ప్రొటోకాల్ పాటించకుంటే అసెంబ్లీలో ప్రశ్నిస్తామని.. అట్టడుగు వర్గాల వారిమైనంత మాత్రాన కలెక్టర్ తమతో మాట్లాడవద్దా అని నిలదీశారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకుని పని చేయడంలో పోటీ పడదామని హితవు పలికారు.

మరిన్ని వార్తల కోసం..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నల్లగొండ జిల్లా అప్రతిష్ఠపాలు

దేశంలోనే బెస్ట్ సిటీ హైదరాబాద్