ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌‌‌‌ గెలుపు ఖాయం: సీతక్క

ములుగు/కొత్తగూడ/మంగపేట, వెలుగు : ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌‌‌‌దేనని ఎమ్మెల్యే సీతక్క ధీమా వ్యక్తం చేశారు. శనివారం బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరిన మహబూబాబాద్‌‌‌‌ జిల్లా కొత్తగూడ మండలం రాంపూర్‌‌‌‌ సర్పంచ్‌‌‌‌ ఈసం స్వామి, ఉపసర్పంచ్ శ్రీనివాస్‌‌‌‌ తిరిగి ఆదివారం సీతక్క సమక్షంలో కాంగ్రెస్‌‌‌‌లో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ములుగు నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యులన్నారు.

 ప్రజలతో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లది ఓట్ల బంధం అయితే, తనకు కుటుంబ బంధం అన్నారు. కార్యక్రమంలో కిసాన్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్‌‌‌‌గౌడ్‌‌‌‌, యూత్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు బానోత్‌‌‌‌ రవిచందర్‌‌‌‌, జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్‌‌‌‌ రూప్‌‌‌‌సింగ్‌‌‌‌, బ్లాక్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ అధ్యక్షుడు సుంకరబోయిన మొగిలి పాల్గొన్నారు. అనంతరం గడప గడపకు కాంగ్రెస్‌‌‌‌ కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా మంగపేట మండలం పూరేడుపల్లిలో పర్యటించారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పారు.