ములుగు(గోవిందరావుపేట), వెలుగు : కాంగ్రెస్ పేదల పార్టీ అని, తనను, పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే సీతక్క కోరారు. మంగళవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని ఫ్రూట్ఫారం, సోమలగడ్డ, బొల్లెపల్లి, రాఘవపట్నం గ్రామాల్లో పర్యటించి స్థానిక నాయకులతో కలిసి ఓటు అభ్యర్థించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పుట్టింది కాంగ్రెస్ అని, కుటుంబ పాలనకోసం పుట్టింది బీఆర్ఎస్ అని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామన్నారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన 50మంది కాంగ్రెస్లో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ, క్లస్టర్ ఇన్చార్జిలు తేళ్ల హరిప్రసాద్, జెట్టి సోమయ్య, కంటెం సూర్యనారాయణ, కోరం రాంమోహన్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
నేడు సీతక్క నామినేషన్..
ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే సీతక్క బుధవారం నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు. భారీ మొత్తంలో జనసమీకరణతో దిశగా సీతక్క నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.