తనను ఓడించేందుకు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కుట్రలు చేస్తున్నారని ములుగు కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సీతక్క అరోపించారు. ఈవీఎంలలో తన ఫోటో, గుర్తు సైజు తగ్గించారన్నారు. జిల్లా కలెక్టర్ బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తు న్నారన్న సీతక్క... ఆమె కలెక్టర్ కండువా లేని బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నారని మండిపడ్డారు.
మహిళా కలెక్టర్ అని గౌరవం ఇస్తున్నామని చెప్పారు సీతక్క. కలెక్టర్ పై తాము ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు . ప్రజలకు మద్దతుగా ఉండే తనను అణచివేసి ఇక్కడి వనరులను దోచుకోవాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. తనను ఓడించేందుకు బీఆర్ఎస్ పెద్దలు ములుగు నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని తెలిపారు.