బీజేపీ, బీఆర్ఎస్ ప్రజలను మోసం చేస్తున్నయి: ఎమ్మెల్యే సీతక్క

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ఎమ్మెల్యే సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. ఈ రెండు పార్టీలు 9 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. దోపిడీ, బంధీ ప్రభుత్వం నుంచి విముక్తి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి.. రాష్ట్రాన్ని దొరల పాలన నుండి రక్షించాలని సీతక్క పిలుపునిచ్చారు. 24 గంటలు కరెంటు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది కాని.. రాష్ట్రంలో ఎప్పుడు పడితే అప్పుడే కరెంట్ పోతోందని అన్నారు. అయినా.. అధికార పార్టీ నేతలు తమకే పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని డిసి తండాలో గత 6 నెలల నుంచి కరెంట్ లేదని సీతక్క విమర్శించారు. ఇక బీజేపీ పైనా ఆమె ధ్వజమెత్తారు. ప్రజల సొమ్మును తీసుకుపోయి అదానికి దోచిపెడుతుందని కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.