
భూపాలపల్లి అంటేనే భూ పోరాటాలకు అడ్డా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా భూపాలపల్లిలోని అంబేద్కర్ సెంటర్ లో జరిగిన కార్నర్ మీటింగ్ కు రేవంత్ రెడ్డితో పాటు సీతక్క హాజరయ్యారు. కాంగ్రెస్ ను తిడుతున్న బీఆర్ఎస్ సభలో జై కాంగ్రెస్ అని నినదించిన గడ్డ ఈ భూపాలపల్లి అని సీతక్క అన్నారు. భూ కబ్జాదారులను గ్రామాల్లోకి రాకుండా తరిమికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అన్యాయం జరిగిన చోట అందరు ప్రశ్నించాలని సూచించారు.