కాంగ్రెస్‌‌ది ప్రజల ఎజెండా : సీతక్క

మంగపేట, వెలుగు : కాంగ్రెస్‌‌ది ప్రజల ఎజెండా అని ములుగు ఎమ్మెల్యే సీతక్క చెప్పారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌‌లో చేరారు. వారికి సీతక్క పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

అనంతరం ఆమె  మాట్లాడుతూ అవినీతి బీఆర్‌‌ఎస్‌‌ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీతక్క వెంట కొమరం ధనలక్ష్మి, అయ్యోరి యానయ్య ఉన్నారు.