కరకట్ట నిధులు ఏమైనయ్..?

కరకట్ట  నిధులు ఏమైనయ్..?

ములుగు జిల్లా ఏటూరునాగారం దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పుష్కర ఘాట్ దగ్గర 18.600 మీటర్ల మేర గోదావరి ప్రవహిస్తోంది. మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు మండలాల్లో ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ఎమ్మెల్యే సీతక్క. ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ సీతక్క ఫైర్ అయ్యారు. కరకట్ట కోసం చాలా ఏళ్లుగా అడుగుతుంటే ఇటీవల నిధులు కేటాయించారన్నారు. అయితే ఇంకా పనులు మొదలు పెట్టలేదంటూ ఎమ్మెల్యే సీతక్క ఫైర్ అయ్యారు.