ఎమ్మెల్యే షకీల్కు నిరసన సెగ.. కాన్వాయ్ని అడ్డుకున్న గ్రామస్తులు

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మద్దెపల్లి తండాలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ కు నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే కాన్వాయ్ ని తాండావాసులు అడ్డుకున్నారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి.. తిరిగి వస్తుండగా అడుకున్నారు. తమ ఊరిని 5 ఏళ్ళు పట్టించుకొని షకీల్.. ఇప్పడు ఎందుకు వస్తున్నారని నిలదీశారు. 

ఎన్నికలు వస్తేనే రాజకీయ నాయకులకు గ్రామాలు గుర్తస్తాయా అని ప్రశ్నించారు. దీంతో గ్రామస్తులను పోలీసులు అడుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.