నవీపేట్, వెలుగు : అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ తో దేశానికి ఒరిగిందేమి లేదని బోధన్ఎమ్మెల్యే షకీల్ విమర్శించారు. గురువారం నవీపేట్మండలం మద్దేపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో భారీ నీటి పారుదల శాఖమంత్రిగా వ్యవహరించిన సుదర్శన్ రెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అనంతరం జన్నేపల్లిలో జీపీ బిల్డింగ్, ఎంపీడీవో ఆఫీస్లో మీటింగ్ హాల్, సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు. ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ సవిత, బుచ్చన్న, వైస్ ఎంపీపీ హరీశ్, పార్టీ ప్రెసిడెంట్ నర్సింగరావు, సర్పంచులు రేణుక, సబిత తదితరులు పాల్గొన్నారు.