ఎడపల్లి, వెలుగు: తడిసిన వడ్లను కొనుగోలు కేంద్రాల్లో తిరస్కరిస్తే నేనే కొంటానని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. బుధవారం ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన టీఆర్ఎస్మినీ ప్లీనరీ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం తన రైస్‌మిల్లులకు వడ్లు కేటాయిస్తే, నేను తిరిగి సీఎంఆర్ఇవ్వడం లేదని ప్రతిపక్షాలు ఆరోపించడం సరికాదన్నారు.
అందుకే ఈసారి ప్రభుత్వం మిల్లులకు వడ్లను కేటాయిస్తే తిరస్కరించానని తెలిపారు. సొంత పైసలతో రైతుల నుంచి కొనేందుకు నిర్ణయించుకున్నానన్నారు. అంతకు ముందు ప్లీనరీని ప్రారంభించిన షకీల్తెలంగాణ తల్లికి పూలమాల వేసి అమరవీరులకు నివాళి అర్పించారు.
జడ్పీ చైర్మన్విఠల్రావు, వైస్‌చైర్ పర్సన్ రజిత యాదవ్, జిల్లా సర్పంచ్ల పోరం ప్రెసిడెంట్ శ్రీనివాస్, బీఆర్ఎస్లీడర్లు పాల్గొన్నారు.