గూడూరు, వెలుగు : ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వానికే ఓటెయ్యాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ చెప్పారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల, మట్టెవాడ, బొద్దుగొండ గ్రామాల్లో శుక్రవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం, మహిళలకు బతుకమ్మ చీరలు, యువకులకు ఆట వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు చేయని అభివృద్ధిని తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు.
అసత్య ప్రచారంతో వస్తున్న వారిని నమ్మి మోసపోవొద్దని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఖాసీం, మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రహీం, సురేందర్, కఠార్ సింగ్, భూక్యా సురేశ్, ఎంపీడీవో రోజారాణి, తహసీల్దార్ అశోక్, ఏవో రాకేశ్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, వేణుమాధవ్‌రెడ్డి పాల్గొన్నారు.