
మహబూబాబాద్ జిల్లా బేతోలు మండలంలో జాతీయ రహదారిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్గీయులు రాస్తారోకో చేపట్టారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్గీయులపై టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. ఎంపీ కవితకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ క్రమంలో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. పోలీసుల అదుపులో ఉన్న వాళ్ళను వెంటనే విడుదల చేయాలంటూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్గీయులు డిమాండ్ చేశారు. అయితే గత కొంతకాలంగా ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్గాల మధ్య వర్గపోరు సాగుతోంది.