ఆదిలాబాద్, వెలుగు: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామస్తుల బస్సు కల నెరవేరింది. ఆదివారం ఆ గ్రామానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ బస్సు సర్వీసును ప్రారంభించారు. ముందుగా ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో పూజలు నిర్వహించిన అనంతరం జెండా ఊపి బస్సు సర్వీసును ప్రారంభించారు.
గ్రామం నుంచి ఆదిలాబాద్ కు వచ్చే విద్యార్థులకు, ఉద్యోగులకు రవాణా కష్టాలు తీరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ కల్పన, బీజేపీ నాయకులు విజయ్, జోగు రవి, ఆకుల ప్రవీణ్, దశరథ్, సురేశ్, రత్నాకర్ రెడ్డి పాల్గొన్నారు.