జీవో317 ఉద్యోగులకు యమపాశంగా మారింది

హైదరాబాద్: ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 ఉద్యోగుల పాలిట యమపాశంగా మారిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. 317 జీవో ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన దీక్షకు దిగారు ఎమ్మెల్యే సీతక్క. అయితే పోలీసులు సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు. తన అరెస్టును వ్యతిరేకించిన ఎమ్మెల్యే సీతక్క ను నాంపల్లి పోలీసు స్టేషన్ లోనూ దీక్ష కొనసాగిస్తున్నారు. 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ చర్యల వల్ల ఇప్పటికి 9 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.  స్థానికతను పరిగాణలోక్ తీసుకోకుండా బదిలీలు చేయడం సరైంది కాదన్నారు. వరి పంట సమస్యను పక్కదోవ పట్టించేందుకు ప్రభుత్వం ఈ జీవోను తెర మీదకు తెచ్చిందని విమర్శించారు. ఉద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు. 

 

 

 

For more news..

సిద్ధార్థ్ క్షమాపణపై స్పందించిన సైనా నెహ్వాల్

కరోనాపై ఆటో డ్రైవర్ అద్భుతమైన మెసేజ్

ఇంకా ఐసీయూలోనే సింగర్ లతా మంగేష్కర్