మహిళలంటే బీజేపీ, టీఆర్ఎస్ లకు చిన్నచూపు

యాదగిరిగుట్ట, వెలుగు : మహిళలంటే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు కనీస గౌరవం లేదని, చిన్నచూపు చూస్తున్నాయని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో మదర్ ఎడ్యుకేషన్, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కుట్టు మెషిన్ శిక్షణ పూర్తి చేసుకున్న 1000 మంది మహిళలకు శుక్రవారం సర్టిఫికెట్లు అందజేశారు. బీర్ల ఫౌండేషన్ సహకారంతో వారందరికీ కుట్టు మెషిన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఒక్క పథకాన్ని కూడా రూపొందించకపోవడం బాధాకరమన్నారు. మహిళలు అన్నిరంగాల్లో ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళలు భయాన్ని పక్కనపెట్టి ఆత్మవిశ్వాసంతో అడుగేయాలన్నారు.