గంగవ్వకు చీర పంపిన ఎమ్మెల్యే సీతక్క

గంగవ్వకు చీర పంపిన ఎమ్మెల్యే సీతక్క

ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ మై విలేజ్ షో నటి గంగవ్వకు ములుగు ఎమ్మెల్యే సీతక్క నూతన వస్త్రాలు పంపించారు. రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో పూడూరులో రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్కను కలిశారు గంగవ్వ. ఈ క్రమంలో ఎమ్మెల్యే సీతక్క గంగవ్వకు బట్టలు పంపిస్తానని తెలిపారు. 

అందులో భాగంగా యువజన కాంగ్రెస్ పార్లమెంట్ మాజీ అధ్యక్షుడు నాగి శేఖర్ కు సీతక్క బట్టలు పంపించి లంబాడి పల్లె గంగవ్వకు అందజేయాల్సిందిగా కోరారు. ఈ మేరకు గంగవ్వ ఇంటికి వెళ్లిన నాగి శేఖర్ ఆమె నివాసంలో నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క తనపై చూపించిన అభిమానానికి  గంగవ్వ కృతజ్ఞతలు తెలియజేశారు.