హైవేపై ప్రమాదం.. వాహనం ఆపి బాధితులకు ధైర్యం చెప్పిన సీతక్క

యాదాద్రి భువనగిరి జిల్లా : ఎమ్మెల్యే సీతక్క మానవత్వాన్ని చాటుకున్నారు. సోమవారం సాయంత్రం ఆమె హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై..  కొందరు రోడ్డు ప్రమాద బాధితులకు ఆపన్న హస్తం అందించారు.  హైవేపై జమ్మపురం వద్ద రెండు కార్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. బాధితులు రక్తపు మడుగులో కార్ల వద్దే పడి ఉండటాన్ని చూసి  సీతక్క చలించిపోయారు.

వెంటనే తన కారును ఆపి.. ఘటనా స్థలం వద్దకు వెళ్లారు.  తీవ్ర గాయాలతో విలవిలలాడుతున్న రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి దగ్గరుండి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్య సిబ్బందికి సూచించారు. ఎమ్మెల్యే సీతక్క మానవత్వంతో స్పందించిన తీరును అందరూ అభినందిస్తున్నారు.