వైసీపీ ఉంటుందో లేదో చూసుకో జగన్: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఏపీలో ఎన్నికల అల్లర్ల కేసులో అరెస్టైన పిన్నెల్లి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత జగన్ ఇవాళ నెల్లూరు జైలులో పిన్నెల్లిని కలిసి పరామర్శించారు.ఈ సందర్బంగా సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు జగన్. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఉంటుందో లేదో చూసుకోవాలని ఎద్దేవా చేశారు సోమిరెడ్డి. జగన్ రెడ్డి హితబోధలు చేయటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

ఈవీఎం పగలగొట్టి, సీపీఐ హత్యాయత్నం చేస్తే తప్పు లేదా అంటూ ప్రశ్నించారు. పాపలు చేశారు కాబట్టే ఈరోజు ఫలితం అనిబావిస్తున్నారని అన్నారు సోమిరెడ్డి.జగన్ అన్నీ డోర్ డెలివరీ చేశామని అంటున్నారని, నిజమే, డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని కూడా డోర్ డెలివరీ చేశారని అన్నారు. పిన్నెల్లి కేసులో చిన్న రాయి కారణంగా సీఐ తలా మిగిలిందని అంటున్నారని, జగన్ కు చిన్న రాయి తగిలితే విజయవాడ యువకుడిని నెల్లూరు జైలులో పెట్టలేదా అని ప్రశ్నించారు.భుజానికి బఠాణి గింజంత గాయం కూడా లేకున్నా కోడికట్టి శ్రీనుని ఐదేళ్లు కనికరం లేకుండా జైలులో పెట్టలేదా అని ప్రశ్నించారు సోమిరెడ్డి.

జగన్ కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదని అంటున్నారని, నిజమే, చంద్రబాబు దగ్గర నుండి రామోజీ రావు, రఘురామకృష్ణ రాజు వరకు అందరిని సమానంగా చూశాడని అన్నారు సోమిరెడ్డి. ప్రజాస్వామ్యం,చట్టం, ఎన్నికల కమిషన్ పై జగన్ కి కనీస గౌరవం కూడా లేదని, చంద్రబాబు అనుభవిస్తారంటూ శాపనార్థాలు పెట్టడం కాదు, మీరు చేసిన పాపాలకు వచ్చే ఎన్నికల వరకు వైసీపీ ఉంటుందో..లేదో చూసుకోండని ఎద్దేవా చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.