కంటోన్మెంట్ మున్సిపాలిటీలో విలీనం : సీఎం ఫొటోకి పాలాభిషేకం

కంటోన్మెంట్ మున్సిపాలిటీలో విలీనం : సీఎం ఫొటోకి పాలాభిషేకం

హైదరాబాద్:  సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని సివిల్‌ ఏరియాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మున్సిపాలిటీలో విలీనం జరిగితే కంటోన్మెంట్ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి జరువుతుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్అ న్నారు. 

కంటోన్మెంట్ మున్సిపాలిటీలో విలీన ప్రక్రియ ప్రారంభమైన క్రమంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి టపాసులు కాల్చి, మిఠాయిలు పంచి వేడుకలు చేస్తున్నారు. కంటోన్మెంట్ ఏరియా డెవలప్ మెంట్ కు కృషి చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బ్రిటీష్ కాలం నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులన్నింటినీ రద్దు చేసి మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇటీవల కేంద్ర రక్షణ శాఖకు లేఖ రాశారు.