- ఎమ్మెల్యేలు శ్రీగణేశ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్
సికింద్రాబాద్, వెలుగు : కుమ్మరిగూడ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహంపై దాడిచేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్తెలిపారు. మంగళవారం ఆయన ముత్యాలమ్మ ఆలయం వద్ద పరిస్థితిని పరిశీలించారు. ధ్వంసమైన విగ్రహం స్థానంలో తిరిగి పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని బస్తీవాసులు, ఆలయ ఫౌండర్ల కుటుంబ సభ్యులు కోరుతున్నారని చెప్పారు. అందరి కోరిక మేరకు ప్రభుత్వం తరఫున విగ్రహ పునఃప్రతిష్ఠ చేస్తామన్నారు.
కొంతమంది రాజకీయాల కోసం బస్తీవాసులు, టెంపుల్ ఫౌండర్ల కుటుంబ సభ్యులను మిస్ గైడ్ చేస్తున్నారని, అవేమీ పట్టించుకోవద్దని కోరారు. అలాగే ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముత్యాలమ్మ గుడిని సందర్శించారు. విగ్రహ పునఃప్రతిష్ఠపై స్థానికులతో చర్చించారు. విగ్రహ పునఃప్రతిష్ఠను 3 రోజులపాటు శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని చెప్పారు.
కుమ్మరిగూడలో ఎమ్మెల్యే రాజాసింగ్కుమ్మరిగూడ ముత్యాలమ్మ గుడిని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం రాజాసింగ్ సందర్శించారు. బస్తీవాసులతో మాట్లాడారు. ఘటన జరిగినప్పటి నుంచి ఇక్కడికి రావాలని ప్రయత్నిస్తున్నానని, పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని రాజాసింగ్డిమాండ్చేశారు.