- పాలమూరుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్
పాలమూరు వెలుగు: స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని, ప్రైవేటు రంగంలో ప్రతిభ తగ్గ అవకాశాలు ఎన్నో ఉన్నాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో గురువారం నిర్వహించిన అప్రెంటిస్ మేళకు ఆయన హాజరయ్యారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విద్య, వైద్యాన్ని మరుగున పడాశాని మండిపడ్డారు. రానున్న రోజుల్లో మహబూబ్ నగర్ కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అందుబాటులో వస్తుందని, ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు. కార్యక్రమంలో ఆయా జిల్లాల డీఈఈవోలు శ్రీధర్ సుమన్, రాధారాణి , సుదర్శన్, రమేశ్, కాజేజీ ప్రిన్సిపాల్ గోపాల్ పాల్గొన్నారు.