విద్యాప్రమాణాలు మెరుగుపర్చాలి : సుదర్శన్​రెడ్డి

 విద్యాప్రమాణాలు మెరుగుపర్చాలి : సుదర్శన్​రెడ్డి
  • ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

బోధన్, వెలుగు : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ విద్యాప్రమాణాలు మెరుగుపర్చాలని ఎమెల్యే సుదర్శన్​రెడ్డి టీచర్లకు సూచించారు. ఆదివారం బోధన్​పట్టణంలోని ఇందూర్​హైస్కూల్​లో ప్రైవేటు స్కూల్​ యాజమన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బోధన్ ప్రాంతానికి గతంలో విద్యాహబ్ గా మంచి పేరు ఉండేదన్నారు.

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత పాలకులు విద్య పై నిర్లక్ష్యం వహించారని, దీంతో విద్యావ్యవస్థ గాడి తప్పిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే విద్యావ్యవస్థ పైప్రత్యేక శ్రద్ధ కనబర్చి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఈనెల 11నుంచి ప్రభుత్వ, ప్రయివేటు వసతి గృహాలను పరిశీలించనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్​ పెట్టాలని నిర్వాహకులకు సూచించారు.

 ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్  తూము పద్మాశరత్ రెడ్డి, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్ కుమార్, గౌరవ అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి, ప్రతినిధులు మిద్దె రాజు, దిగంబర రావు, ఐఆర్ చక్రవర్తి, చౌడారెడ్డి, హరికృష్ణ, జయప్రకాశ్, హన్మంతు రావు, వై.శ్రీనివాస్ రావు, కృష్ణ మోహన్, సురేశ్, సూర్యప్రకాశ్​రావు తదితరులు పాల్గొన్నారు.