
నిజామాబాద్, వెలుగు : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేందర్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం కోసం 24న నిజామాబాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన డీసీసీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. బోర్గంలోని భూమారెడ్డి ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు నిర్వహించే మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి పాల్గొంటారన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న నరేందర్‌రెడ్డిని అన్ని కోణాల్లో ఆలోచించి పార్టీ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయిస్తుందన్నారు.
రూ.30 కోట్ల నజరానా నిజమేనా..?
కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు రూ.30 కోట్ల నజరానా ముట్టజెప్పాక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చాన్స్ దక్కిందని అంజిరెడ్డి కామెంట్స్‌పై నోరు విప్పాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సపోర్టు కూడా తనకే ఉందని ఓటుకు రూ.2 వేల చొప్పున పంచడానికి రెడీ అంటున్న ఆయనకు బీజేపీ ఎంత డబ్బు ఇచ్చిందో వెల్లడించాలన్నారు. స్టేట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, లైబ్రరీ కమిటీ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నుడా ఛైర్మన్ కేశవేణు, నరాల రత్నాకర్, ఏబీశ్రీనివాస్, జావెద్ అక్రమ్, విపుల్‌గౌడ్, వేణురాజ్, రోహిత్ ఉన్నారు.