​ప్రజా చైతన్యంతో రాజ్యాంగ రక్షణ .. గ్రామగ్రామానా కాంగ్రెస్​ పాదయాత్ర : ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

​ప్రజా చైతన్యంతో రాజ్యాంగ రక్షణ .. గ్రామగ్రామానా కాంగ్రెస్​ పాదయాత్ర : ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

నిజామాబాద్, వెలుగు: రాజ్యాంగం ద్వారా ప్రజలకు లభించిన సమన్యాయం, సమాన హక్కులను కాలరాస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని మాజీ మంత్రి, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి అన్నారు. ఈ విషయంలో ప్రజలను చైతన్యపరుస్తూనే కాంగ్రెస్​ ప్రభుత్వ స్కీమ్​లు ప్రజలకు చేరేలా హైకమాండ్​ ఆదేశాలతో పాదయాత్రలు నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం డీసీసీ ఆఫీస్​ ఆవరణలో ఏర్పాటు చేసిన జైబాపు, జైభీమ్​, జై సంవిధాన్​ ప్రొగ్రామ్​లో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్​ ప్రజల స్వేచ్ఛను హరిస్తుంటే ఊరుకోమన్నారు. 

కార్యకర్తలతో గ్యాప్​ పూడ్చే ప్రొగ్రాం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​

బీజేపీ కుట్రలను ప్రజలకు తెలిపేందుకు జైబాపు, జైభీమ్, జై సంవిధాన్​ పాదయాత్రలు చేపడుతున్నామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. కాంగ్రెస్​ సిద్ధాంతాలను కార్యకర్తలు జనానికి వివరిస్తూనే ప్రభుత్వం నుంచి వారు ఆశిస్తున్న సేవలను సర్కారు దృష్టికి తీసుకెళ్తారన్నారు. అధికారంలోకి వచ్చాక పార్టీ లీడర్స్​, కార్యకర్తలకు, ప్రజలకు  మధ్య ఏదైనా గ్యాప్​ ఉంటే పూడ్చడానికి 28 దాకా నిర్వహించే పాదయాత్రలు దోహదపడతాయన్నారు.  స్టేట్​ ఉర్దూ అకాడెమీ ఛైర్మన్​ తాహెర్, మార్క్​ఫెడ్​ చైర్మన్ మారగంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్​ రమేశ్​రెడ్డి, సిరిసిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ సంతోష్​, నుడా చైర్మన్​ కేశవేణు, మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నీటిని పొదుపుగా వాడుకోవాలి

నవీపేట్, వెలుగు : రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మండలంలోని శాఖపూర్ లిఫ్ట్ కాలువలను పరిశీలించిన అనంతరం అయన మాట్లాడుతూ యాసంగి సీజన్​లో ఆరుతడి పంటలను సాగు చేసుకుంటే మేలన్నారు.  నవీపేట్ గ్రామపంచాయతీ ని పరిశీలించిన ఆయన మార్కెట్ ఇతర చోటికి తరలించడంపై సెక్రటరీ తో అడిగి తెలుసుకోగా స్థలాన్ని పరిశీలిస్తున్నామని సెక్రటరీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. నెహ్రూ రోడ్డు పై వ్యాపారులు సామగ్రిని పెట్టడం తో రాకపోకలకు ఇబ్బంది అవుతుందని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రాగా, తొలగించాలని జీపీ సెక్రటరీ, ఎస్సైని ఆదేశించారు. తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ బాల్ రాజ్ గౌడ్, నాయకులు బుచ్చన్న, మహేందర్ తదితరులు ఉన్నారు.

చక్కెర పరిశ్రమ పున: ప్రారంభిస్తాం 

బోధన్​,వెలుగు : బోధన్ చక్కెర పరిశ్రమకు పున:ప్రారంభానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పి.సుదర్శన్​ రెడ్డి అన్నారు. శుక్రవారం సాలూర మండల కేంద్రంలో మండల పరిషత్​ ఆఫీసును ప్రారంభించి మాట్లాడారు. కొత్త మండలాల్లో ఏర్పాటు చేసే ఆఫీసులలో పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమిస్తామని ప్రజలు అందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు.