ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు పెన్షన్ కార్డులను అమ్ముకుంటున్నారని జీహెచ్ ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు మధుసూదన్ రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి ఆరోపించారు. 1500 రూపాయలకు పెన్షన్ కార్డులను అమ్ముకుంటున్నారంటూ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలోని డిప్యూటీ కమిషనర్ క్యాబిన్ ముందు ధర్నా నిర్వహించారు. జీహెచ్ఎంసీ అధికారులు పంపిణీ చేయాల్సిన పెన్షన్ కార్డ్స్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి ఎందుకు చేరాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన అనుచరులతో లబ్దిదారులకు కార్డ్స్ ఇస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారి.. అర్హులైన వారికి సకాలంలో పెన్షన్లు అందకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రెండు రోజుల్లో లబ్దిదారులకు పెన్షన్ కార్డ్స్ పంపిణీ చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని స్పష్టం చేశారు.