కౌడిపల్లి, వెలుగు : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత హామీలు ఇచ్చి ప్రజలను ఆందోళనకు గురి చేస్తోందని ఎమ్మెల్యే సునీతా రెడ్డి విమర్శించారు. శుక్రవారం కౌడిపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందన్నారు. గ్రామ సభలు పెట్టి వందల పేర్లు చదువుతున్నారు కానీ ఎంతమందికి వచ్చాయో చెప్పకుండా ప్రజలకు అధికారులకు పంచాయతీ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టైం పాస్ గ్రామసభలు తప్ప వాటితో ప్రజలకు వచ్చేదేమీ లేదన్నారు. ఇస్తామన్న పథకాలు ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రామా గౌడ్, నవీన్, దుర్గారెడ్డి, సందీప్, రవి సాగర్, సుధాకర్, మాధవరెడ్డి,అమర్ సింగ్, ప్రవీణ్ కుమార్, పురుషోత్తం, సంగప్ప పాల్గొన్నారు.